చిరంజీవి మీద ఏడుపెందుకు

 

నాక్కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది.

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు
చిరంజీవి కి అంతదమ్ములేదు లే
రాజకీయాల్లోకి రావడానికి అనేవాళ్ళు కొందరు

వచ్చిన మర్నాటి నుంచి
చిరంజీవి రాజకీయాల్లోకి రాకపోయి ఎంత ఆనందంగా ఉండేవాడో అంటూ
మొసలి కన్నీరు కారుస్తున్నారు

నేనేమీ చిరంజీవి అభిమానిని కాను
నాకు అంతు పట్టనిదల్లా ఈ ద్వంద్వ ప్రవృత్తే

పరకాలని ప్రక్కన పెట్టుకున్నాడు
తనేమయినా రాజకీయ దురంధరుడా అన్నోళ్ళే
పరకాల పోగానే ఇక ప్రజారాజ్యం మునిగినట్టే అంటారు
నాకు అంతు పట్టనిదల్లా ఈ ద్వంద్వ ప్రవృత్తే

చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రావడమే మేలని దొంగఏడుపులు ఏడుస్తారు
వచ్చాడంటే – హమ్మయ్య చిరంజీవి పనైపోయిందింక అంటారు
నేనేమీ చిరంజీవి అభిమానిని కాదు
వీళ్ళ ద్వంద్వప్రవృత్తి ని చూసి చూసి విసిగివేసారినవాణ్ణంతే

చిరంజీవి జై తెలంగాణా అన్నా ఏడుపే,
జై సమైక్యాంధ్రా అన్నా ఏడుపే వీళ్ళకి
తెలంగాణాకి జైకొడితే – ఇక కోస్తాలో రాజ్యం భూస్థాపితమంటారు
సమైక్యాంధ్ర కి జైకొడితే తెలంగాణా లో వీళ్ళ సినిమాలు భూస్థాపితమంటారు

బాబూ చిరంజీవి రాజ్యమెలాగూ ఓడిపోయింది
అతని మానాన అతణ్ణొదిలేయండి
పొద్దున లేచిన దగ్గర్నుంచీ చిరంజీవి గురించి
అతని వీరాభిమానులకంటే ఎక్కువగా ఆలోచించడం మానేయండి
ద్వంద్వ ప్రవృత్తి మాటలతో జనాలని విసిగించకండి…

అభిప్రాయములు

Filed under Uncategorized

సోనియా చేసింది కరక్టేనా??

 ప్రక్రియ మొదలెడతాములెమ్మని చెప్పించి

 రాష్ట్రనాయకుల ఊసరవెల్లి రాజకీయల్ని బట్టబయలు చేసింది

 మొన్నటి దాకా ప్రత్యేక తెలంగాణా కి అనుకూలమని చెప్పిన

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు

 చిదంబర ప్రకటన ని తప్పుబట్టి

తన ట్రేడ్ మార్క్ ఊసరవెల్లి రాజకీయాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడు

మొదట్నుంచీ అటా ఇటా తేల్చుకోలేకున్న చిరంజీవి

 గుడ్డిలో మెల్లగా తెలంగాణా తరపే మాట్లాడుతున్నాడు

ముందు చెప్పిన మాటకి వెరచి

 పోనీలే, బాబులా నిర్లజ్జ గా రంగుమార్చలేదు.

రోజుకొకరు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే,

గ్రేటర్ ఎలక్షన్ల లో సోదిలోకి లేకుండా పోతుందని భయపడ్డ కెసీఅర్

 హఠాత్తుగా హీరో అయిపోయాడు “సెలైని”రాహారదీక్ష తో

ఆశ్చర్యమేస్తుంది, ఇంతమంది ని అప్పట్లో

కాలికింద ఎలా అణచిపెట్టాడో రాజశేఖరుడు!!!

అభిప్రాయములు

Filed under Uncategorized

తారకరత్న ఏమయ్యాడు…

బాబాయే సియం అవ్వాలన్నాడు…
బాబాయే సియం అవుతాడన్నాడు…
నాలుగు మొట్టికాయలు తిన్నాక-
ఇప్పుడు కాదు- ఇంకెప్పుడైనా బాబాయే సియం అన్నాడు…

స్టేజీ లెక్కి తొడగొట్టాడు..
ఇటుపక్కవాళ్ళు మాకుకనపడలేదంటే
ఇటు తిరిగి తొడగొట్టాడు..
అటు కనపడలేదంటే
మళ్ళీ అటు తిరిగి తొడగొట్టాడు..

తాతయ్య పేరు చెప్పుకుని
మామయ్యని ప్రక్కనెడదామనుకున్నాడు
ఆ తాతయ్యకే మూడు చెరువుల నీళ్ళు త్రాగించిన మామయ్యకు
మనవళ్ళొక లెక్కా

పనిలోపనిగా తన సినిమా విడుదల చేసుకున్నాడు,
ఈదెబ్బకి హీరోగా సెటిలైపోతాననుకున్నాడు..
తనే దెబ్బైపోతానని తర్వాత తెలుసుకున్నాడు..
ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడు???

అభిప్రాయములు

Filed under Uncategorized

రోశయ్య కి చేతకాదా??

15 సార్లు రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చినాయన పనికిరాడట…
గ్రూపులు కట్టలేకపోవడం వల్ల కాబోలు
ఆయన అనుభవం సియం పదవికి అక్కరకి రాదట…
రియల్ వ్యాపారానుభవం లేకపోవడం వల్ల కాబోలు

ఆయనకి ప్రజాకర్షణ లేదట
క్యాడర్ ని ఉత్తేజపరచలేడట
నలభయ్యేళ్ళ రాజకీయానుభవం ఉన్న ఆయనని దించి
నలభయ్యేళ్ళ వయసులేని మరో కుర్రాడిని పీఠమెక్కించకపోతే
రాష్ట్రం కుంటుపడిపోతుందట!!!

ఎవరి వ్యాపారాలు వాళ్ళవి
ఎవరి భయాలు వాళ్ళవి
ఎవరి ప్లాన్లు వాళ్ళవి
ఎవరి స్వప్రయోజనాలు వాళ్లవి!!!

అభిప్రాయములు

Filed under Uncategorized

ఏతా “వాతా” చెప్పొచ్చేదేంటంటే-

పాలకులుగానీ,
నాయకులుగానీ,
విపక్షాలుగానీ,
స్వపక్షాలుగానీ,

పత్రికలుగానీ,
ఛానెళ్ళుగానీ,
పెద్దోళ్ళుగానీ,
పిల్లోళ్ళుగానీ,

నోటికొచ్చినట్టుగానీ,
బుద్దిపుట్టినట్టుగానీ,
మాట్లాడితేగానీ,
ఆట్లాడితేగానీ,

చెణుకులేయడానికీ,
చురకులేయడానికీ,
మెత్తగా మొత్తటానికీ-
అవసరమైతే “వాత”లెట్టటానికీ……..!!!

అభిప్రాయములు

Filed under Uncategorized